Sri SAJAN Seva Foundation, Syamasundarapuram, Tekkali, Srikakulam

5, ఫిబ్రవరి 2018, సోమవారం

శ్యామసుందరాపురం - పాఠశాల లో 69వ గణతంత్ర దినోత్సవం

శ్యామసుందరాపురం - పాఠశాల లో 69వ గణతంత్ర దినోత్సవం 






వద్ద ఫిబ్రవరి 05, 2018 కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

10, డిసెంబర్ 2017, ఆదివారం

శ్యామసుందరాపురం లో స్వచ్ఛభారత్ కార్యాక్రమం

శ్యామసుందరాపురం లో స్వచ్ఛభారత్ కార్యాక్రమం 






వద్ద డిసెంబర్ 10, 2017 కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

శ్యామసుందరాపురం లో ఉచిత విద్య ను అందిస్తున్న దృశ్యం

శ్యామసుందరాపురం లో ఉచిత విద్య ను అందిస్తున్న దృశ్యం 














వద్ద డిసెంబర్ 10, 2017 కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

4, డిసెంబర్ 2017, సోమవారం

మనిషి కానివాడు ఏదైనా... వ్యర్థమే!

మనిషి కానివాడు ఏదైనా... వ్యర్థమే!

   సూర్యరశ్మి, నదులు, సరస్సులు, చెట్లు తమకు ఉన్నదంతా మానవాళికి అందిస్తున్నాయి. ప్రకృతి - అందరికీ అన్నీ ఇచ్చేస్తుంది. బేధాలు చూపదు. శాస్త్రజ్ఞులు, ఆర్థికవేత్తలు, రచయితలు, మేధావులు వంటి వారందరూ ప్రకృతివలె తరతమ బేధాలు లేకుండా సర్వమానవాళి కోసం కృషి చేస్తారు. ఈ దృక్పథం రాజకీయ నాయకుల్లో... పరిపాలకుల్లో రావల్సి ఉంది. జనాన్ని కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడగొట్టి వారి మధ్య కలతలు రేపి, తమ పబ్బం గడుపుకునే నీచ ప్రవృత్తిని వదిలేస్తేనే ఈ భూమి పదిలంగా ఉంటుంది. దాని మీద బతికే మనిషీ పదిలంగా ఉంటాడు. ఇకపోతే ఆర్థిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు, నటులు, వ్యాపార వేత్తలు, కళారంగ ప్రముఖులు, అందరూ తప్పక ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. ముందు వారు మనుషులు. ఆ తరువాతే వారి వారి నైపుణ్యం వల్ల వివిధ రంగాలలో ప్రముఖులయ్యారు. ప్రముఖులయిపోయాం కదా ఇక మాకేం? మనుషులుగా ప్రవర్తించకపోయినా ఫర్వాలేదు - అని అనుకుంటే పొరపాటు. మనిషి తనాన్ని వదిలేసిన మరుక్షణం వారు జంతు ప్రవృత్తిలోకి నెట్టివేయబడతారు. వారి వారి రంగాలలో ఎంత ప్రతిభ ఉన్నవారైనా, ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్న వారైనా దభీలుమని కిందపడి నైతికంగా పతనమైన వారిలో చేరిపోతారు.
ఉదాహరణకు కొన్ని విషయాలు చూద్దాం. ఒక ఊళ్లో ఉన్న ఒక ఉపాధ్యాయుడు ఖాళీ సమయం ఉంది కదా అని పక్కన చిట్‌ఫండ్‌ కంపెనీ పెట్టి జనాన్ని మోసం చేస్తున్నాడనుకుందాం. లేదా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ విద్యమీద, విద్యార్థుల మీద శ్రద్ధ పెట్టడం లేదనుకుందాం. అతడు ఉపాధ్యాయుడిగా అనర్హుడు కదా? లేదా తన విద్యార్థినే ఖాళీ క్లాసురూంలో రేప్‌ చేశాడనుకుందాం... ఇంకా ఏమిటీ? అతణ్ణి మనిషనే అందామా? అన్ని వృత్తుల వారిని తయారుచేసేది ఉపాధ్యాయుడు గనక, సమాజం అతణ్ణి గురుస్థానంలో కూర్చోబెట్టింది. అతను మనిషే కానప్పుడు ఇక ఉపాధ్యాయుడెట్లా అవుతాడు? గురు స్థానం ఎలా ఉంటుంది? అలాగే ఒక డాక్టరున్నాడనుకుందాం.. అతనిలో సేవాభావం ఏమాత్రం లేక, కేవలం వ్యాపార లక్షణాలుంటే, ప్రాణాలు పోసే పనిమానేసి ప్రాణాలు తీసే డ్రగ్‌ మాఫియాతో చేతులు కలిపితే, రక్తం అమ్ముకునే వ్యాపారస్తుడిగా మారితే, అతన్నేమందాం? డాక్టరుగా కాదు గదా మనిషిగా కూడా అనర్హుడు కాదా? దేశ భద్రతను కాపాడాల్సిన సైనికులు సరిహద్దు గ్రామాల్లో అరాచకాలు సృష్టించి యువతుల్ని పాడుచేస్తే... వారినేమందాం? రక్షకుడిగా మహోన్నతమైన స్థానంలో ఉన్న వాడు దిగజారి, మామూలు మనిషిగా కూడా మిగలడు కదా?
తెల్లవారితే దినపత్రికల్లో ప్రధాన శీర్షికల్లో ఇలాంటి ఎన్నెన్నో ఘోరమైన వార్తలు చదువుతున్నాం. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, వ్యాపారస్తులు, మేధావులు, కళాకారులు, ఏ రంగంలోని వారైనా సరే, వారి వారి రంగాల్లో వారి వారి గౌరవాలు నిలబడి ఉండాలంటే ముందు కనీసం మనుషులుగా ప్రవర్తించాలి. ఏ పని చేసినా, మాట్లాడినా, రాసినా, ఎంతో బాధ్యతతో వ్యవహరించాలి. తమ విలువ, తమ స్థానం భద్రంగా ఉండాలంటే ముందు 'మనిషి'గా తన స్థానం సుస్థిరం చేసుకోవాలి. మనిషి మనిషి కానప్పుడు ఇక ఏదీ కాలేడు. ఎవరైనా జంతు ప్రవృత్తితో గొప్ప వాళ్ళుగా నిలబడాలనుకుంటే, అది వారి భ్రమ! ఏ నాగరిక సమాజమూ ఒప్పుకోదు. మనిషి తను మనిషనన్నది మరచిపోయి క్రూరంగా ప్రవర్తించినప్పుడు... సమాజం కూడా అతను మనిషన్నది మరిచిపోవాలి. ఒక జంతువుగానే పరిగణించాలి. కఠినంగా శిక్షించాలి. మనిషి బలహీనతల మీద చేసే వ్యాపారాలు, రాజకీయాలు ఆగాలి. విశాల దృక్పథంతో హేతుబద్ధమైన మానవతా వాదాన్ని ఆహ్వానించాలి. నైతికంగా, మానసికంగా మనిషిని బలహీన పరిచే బోధనలు, ప్రవచనాలు, దైవ వాక్కులు ఆగాలి. సర్వకాల సర్వావస్థల్లో మనిషి, తను మనిషినన్న స్పృహతో, బాధ్యతతో వ్యవహరించగలిగితే, ఆరోగ్యవంతమైన మంచి సమాజాన్ని రూపొందించుకోగలం.
చెడుపనులు చేసేవారు ఎవరైనా భయంతో బతకాల్సిందే. ఆ భయంలో నుంచి బయట పడటానికి వారు దేవుణ్ణి, పాపాల్ని, పుణ్యాల్ని, పునర్జన్మల్ని, వాస్తుని, జాతకాల్ని, రంగురాళ్ళని, అల్లా గొలుసుల్ని, దైవప్రార్థనల్ని, కీర్తనల్ని ఇంకా ఎన్నింటినో నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మకాల్ని మతబోధకులు వారి స్వార్థం కోసం రెచ్చగొట్టి జనాన్ని మరింత బలహీనులుగా తయారుచేస్తుంటారు. ఈ విషయాలు గ్రహించి, జనం తమని తాము తెలుసుకుని, చైతన్యవంతులై ప్రవర్తిస్తే బావుంటుంది. నువ్వు ఎంత మాత్రమూ పాపాత్ముడివి కావు. అలా అని నీ కెవరైనా హితబోధ చేస్తే, ఆత్మవిశ్వాసంతో తిప్పికొట్టి అతణ్ణి, అతడి ప్రవర్తనను, ఆలోచనా విధానాన్ని సరిచేసుకోమని హెచ్చరించు. అంతే కాని, ఎవరి మాయమాటలో నమ్మి మనిషి స్థానం నుండి కిందికి దిగజారకుండా... నీకు దొరికిన ఈ అందమైన బాధ్యతగల నాగరిక జీవితాన్ని హాయిగా జీవించు. ఇతరులను కూడా అలా జీవించనివ్వు. మనమంతా ఎదిగిన మనుషులం అని నిరంతరం గుర్తు చేసుకుంటుండాలి.
''మీ నాస్తికత్వాన్ని బయటికి తెచ్చి అనవసరంగా చర్చించకండి'' అని ఎవరైనా అంటే... మానవతావాదులు, హేతువాదులు సవినయంగా వారికి జవాబు చెప్పాలి,, ''అయ్యా! వేల వేల యేండ్లుగా మీ ఆస్థికత్వాన్ని మీ వ్యక్తిగత విషయంగా మీ ఇంటికి పరిమితం చేసుకోలేదు కదా? మరిప్పుడు మీరు మాకెందుకు చెపుతున్నారూ? దాన్నొక బహిరంగ ప్రచార కార్యక్రమం చేసి, తరతరాలుగా మోసం చేస్తూ వచ్చారు కదా? ఏం సాధించారూ? మీరు చెప్పే విషయాల్లో దేనికీ నిరూపణ లేదు. ఏదీ వాస్తవం కాదు. భ్రమల మీద అపోహల మీద, కల్పిత కథలమీద, బతికే రోజులు పోయాయి. అందువల్ల దయచేసి మా అభిప్రాయాలు కూడా విని ఆలోచించండి. మీకూ మాకూ కారణమనేది ఒక కామన్‌ పాయింటుంది. మీరు మహానుభావుల్ని 'కారణ జన్ములు' అని ముద్ర వేస్తారు కదా? అంటే.. మీరు కారణాన్ని గుర్తించారు కానీ, అదేమిటో అన్వేషించడం లేదు. మాకు భ్రమలు, అంధవిశ్వాసాలు లేవు గనక, వైజ్ఞానిక దృక్పథమనే దివిటీలు పట్టుకుని, చీకట్లు చీల్చుకుంటూ ఇంతదాకా వచ్చాం. ఇప్పుడైతే మా చేతుల్లో దివిటీల స్థానంలో అత్యాధునిక విద్యుద్దీపాలు వెలుగుతున్నాయి. మరి మీ చేతిలో దీపమే లేదు. మీరు చీకట్లో బతుకుతూ జనాన్ని మహాంధకారంలోకి తోసేసే పని దయచేసి మీరే ఆపాల్సి ఉంది. మీకు ఆలోచన రాకపోతే రాకపోనీయండి. ఆలోచించేవారిని ఆలోచించనీయండి. 'కారణం' గోడకు అటువైపు మీరుంటే ఇటువైపు మేమున్నాం. అంతే తేడా! ఇప్పుడు ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో జనావళికి చీకట్లు అవసరమా? వెలుగు అవసరమా? జనానికే ఆలోచించుకునే అవకాశమివ్వండి!
అనాదిగా మతపెద్దలు, భక్తులు చెపుతున్నట్టు దేవుడనే వాడుంటే... అతను సర్వాంతర్యామి, సర్వం తెలిసిన వాడూ అయితే మనం ఇప్పుడు అతని కథల్ని ప్రశ్నించాల్సి ఉంది. విశ్లేషించాల్సి ఉంది. నిజం నిగ్గు తేల్చాల్సి ఉంది. ఎందుకంటే మీరు ఏ దేవుడి కథనైనా తీసుకుని పరిశీలించండి. అతను సృష్టికర్త కనుక, లోకంలో తెలిసి తెలిసి తప్పుడు మనుషుల్ని పుట్టిస్తాడు. మళ్లీ వారిని నిందిస్తూ, దండిస్తూ ధర్మాన్ని పరిరక్షించడానికే తను పుడుతున్నానంటున్నాడు? తప్పుడు మనుషుల్ని పుట్టించిన ఆయన తన 'తప్పు'ను ఒప్పుకోవాలి కదా? ఏమతంలోనైనా, ఏ కథలోనైనా అలా జరిగిందా? లేదే? విజ్ఞతతో ఏ దేవుడైనా తన భక్తుల ముందు తన తప్పు ఒప్పుకున్నాడా? లేదు కదా? తప్పుడు మనుషుల్ని సృష్టించిన తప్పు ఆయనకే కదా? కొంచెం ఆలోచించండి. సినిమాల్లో తన హీరోయిజం చూయించుకోవడానికి హీరు చేసే తక్కువ స్థాయి గిమ్మిక్కులాగా లేదూ? హీరోయిన్‌పైకి అల్లరి చేయడానికి కిరాయి మనుషుల్ని పంపి... మళ్ళీ సమయానికి వెళ్ళి, వాళ్ళను తన్ని పెద్దహీరోలా ఆమెను కాపాడినట్టు సీను రక్తికట్టించడం.. అసలు దేవుడనే భావనకే సరైన ఆధారం లేకపోయినప్పుడు కర్మఫలం, పునర్జన్మ ఫలితం, పాప నివృత్తి లాంటి మాటలకు అర్థం ఉందా? ప్రతీ దానికీ మేం కారణమడుగుతున్నాం. ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నతోనే ఎదుగుతున్నాం. మీరేమో ప్రశ్నలు వేయకుండా ఊరికే 'నమ్ముతూఫో' అని అంటారాయే! కారణమంటే ఏమిటి? హేతువు! మరి ఆ హేతువును అన్వేషిస్తున్న వాళ్ళం మేమే కదా?'' అని!
''నేనొక హేతువాదిని. ఎనభైశాతం ప్రజల మనసు నొప్పించకుండా, మన మొక సహజమైన మామూలు నిజాన్ని చెప్పలేని దయనీయమైన సమాజంలో బతుకుతున్నందుకు నాకు కోపంగా, బాధగా కూడా ఉంది'' అని రిచర్డ్‌ డాకిన్స్‌, క్రిస్టోఫర్‌ హిచ్చెన్స్‌ల అభిమాని, 'ద ఎండ్‌ ఆఫ్‌ ఫెయిత్‌' అనే ప్రసిద్ధ గ్రంథ రచయిత, అమెరికన్‌ న్యూరో సైంటిస్ట్‌ సామ్‌హారిస్‌ అన్నాడు. ఆయన ఒక చోట రాసుకున్న నాలుగుపంక్తులు చూడండి.
''నేను మరణించినప్పుడు
నా పరమాణువులన్నీ నిష్ప్రయోజనాలవుతాయి
నేను మళ్లీ అంతరీక్ష ధూళిగా మారిపోతాను
గాలి నన్ను ఎగరేసుకు పోతుంది
విశ్వమంతా వెదజల్లుతుంది.

నేనప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ
విశ్వాంతరాళంలోని కొత్త చంద్రుళ్ళనీ
దర్శిస్తాను...
అప్పుడెంతో మహాద్భుత కవిత్వంగాఉంటుంది
నేనొచ్చి, నీ సాండ్విచ్‌ మీద వాలేంత వరకు...
తొలితరం మహిళా హేతువాది, అమెరికా హేతువాద వ్యవస్థాపక అధ్యక్షురాలు మడలైన్‌ ముర్రే ఓ హేర్‌ అంటారు... ''హేతువాది అంటే భగవంతుడికి బదులు, తనని తానూ... తనతోటి వారినీ ప్రేమించేవాడు. స్వర్గమనేది ఎక్కడో లేదని, దాన్ని ఈ ధరాతలం మీదనే జనమంతా కలసి నిర్మించుకోవాల్సి ఉందని, అందులోనే అందరూ కలిసి మెలిసి ఆనందంగా జీవించాల్సి ఉందని తెలిసినవాడు.''
అందుకే నేనంటున్నదేమంటే... మనకు మనిషిని మనిషిగా నిలబట్టే కళలు కావాలి. పథకాలు కావాలి. ప్రణాళికలు కావాలి. విశాల దృక్పథంతో హేతుబద్ధమైన మానవతావాదం కావాలి!
''భారతదేశాన్ని, ఇతర ప్రపంచ దేశాల్ని మతం అనే కళ్ళద్దాల్లోంచి చూసినప్పుడు నాకు భయంకరమైన దృశ్యాలు కనిపించాయి. అవన్నీ భ్రమలకు, మూఢనమ్మకాలకు, దోపిడీకి, కొందరి స్వార్థప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని రుజువైంది. అందుకే ఎప్పటికప్పుడు నేను వాటిని ఖండిస్తూ వస్తున్నాను. అంతేకాదు, వాటిని సమూలంగా నాశనం చేసి, సమాజాన్ని శుభ్రం చేయాల్సి కూడా ఉంది.''
-డాక్టర్‌ దేవరాజు మహారాజు 
వద్ద డిసెంబర్ 04, 2017 కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: పోస్ట్‌లు (Atom)

శ్యామసుందరాపురం - పాఠశాల లో 69వ గణతంత్ర దినోత్సవం

  • మనిషి కానివాడు ఏదైనా... వ్యర్థమే!
    మనిషి కానివాడు ఏదైనా... వ్యర్థమే!    సూర్యరశ్మి, నదులు, సరస్సులు, చెట్లు తమకు ఉన్నదంతా మానవాళికి అందిస్తున్నాయి. ప్రకృతి - అందరికీ ...
  • శ్యామసుందరాపురం లో స్వచ్ఛభారత్ కార్యాక్రమం
    శ్యామసుందరాపురం లో స్వచ్ఛభారత్ కార్యాక్రమం 
  • శ్యామసుందరాపురం - పాఠశాల లో 69వ గణతంత్ర దినోత్సవం
    శ్యామసుందరాపురం - పాఠశాల లో 69వ గణతంత్ర దినోత్సవం  

నా గురించి

నా ఫోటో
Challa Krishna Rao
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి

బ్లాగు ఆర్కైవ్

  • ▼  2018 (1)
    • ▼  ఫిబ్రవరి (1)
      • శ్యామసుందరాపురం - పాఠశాల లో 69వ గణతంత్ర దినోత్సవం
  • ►  2017 (3)
    • ►  డిసెంబర్ (3)

దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయండి

  • హోమ్

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

సాధారణ థీమ్. Blogger ఆధారితం.